చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హాజరై నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ​అధ్యక్షులుగా తడక నరసింహ, ​ఉపాధ్యక్షులుగా అరిగె నర్సింహ,
​కార్యదర్శిగా కోడెం గణేష్, ​డైరెక్టర్లుగా కందగట్ల కిషన్, కోమటి గోవర్ధన్, గర్దాసు సత్యనారాయణ, తాటి రవి, మహిళా డైరెక్టర్లుగా గంజి శోభ, వనం సంతోష లు పదవి బాధ్యతలు చేపట్టారు. ​ఈ వేడుకకు గత పాలక వర్గం అధ్యక్షులు జెల్లా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు గడ్డం భాస్కర్, కార్యదర్శి గంజి గణేష్, కోశాధికారి కోడెం సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ బీమిడి ప్రదీప్, ఉపసర్పంచ్ బాతరాజు ధనుంజయ, గ్రామ పెద్దలు చెన్నగోని అంజయ్య, ఢిల్లీ మాధవరెడ్డి, పద్మశాలి కుల సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.