NEWS@5:00 P.M | 12 జూలై 2026 ముఖ్యాంశాలు
కాంగ్రెస్ ప్రభుత్వానిది ఘోర వైఫల్యం
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లేఖలో కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. click here to read full story
మహిళ ఇంట్లో డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన!
బెంగళూరులో ఓ ఈ-కామర్స్ సంస్థకు చెందిన డెలివరీ సిబ్బందిపై మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్సిల్ అందించేందుకు తన ఇంటికి వచ్చిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. click here to read full story
ప్రొద్దుటూరులో రోడ్డు వివాదం..
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో సిమెంట్ రోడ్డు నాణ్యత అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మీడియాకు వివరాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. click here to read full story
ప్రభుత్వ లాంఛనాలతో ఎస్. జానకి అంతిమ సంస్కారాలు
ప్రముఖ గాన కోకిల ఎస్. జానకి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం మైసూరులో జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరులోని మహారాజా కాలేజ్ మైదానంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మైసూరు సమీపంలోని ఆమెకు చెందిన ప్రైవేట్ ఫామ్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. click here to read full story
నీళ్లు ఇవ్వకుండా పాలిటిక్స్
తెలంగాణలో సాగునీటి సమస్య, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు నీరు అందించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. click here to read full story
ఎస్. జానకికి రాహుల్ గాంధీ నివాళి
ప్రముఖ గాన కోకిల ఎస్. జానకి మృతిపట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించిన ఆయన, జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. click here to read full story
తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయం
మహిళా ప్రధాన కథతో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని, ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు మహిళా ప్రధాన చిత్రంగా నిలిచినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. click here to read full story
ప్రకాశ్ రాజ్ సంచలన పోస్ట్ వైరల్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన సోషల్ మీడియా పోస్టుతో చర్చనీయాంశంగా మారారు. రాజకీయాలు, సామాజిక అంశాలపై తరచూ స్పందించే ఆయన ఈసారి కూడా పరోక్ష వ్యాఖ్యలతో ఆసక్తి రేకెత్తించారు. click here to read full story
చిన్నారి అభిమానికి మెగా సర్ప్రైజ్
తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిని కలిసేందుకు వచ్చిన ఓ చిన్నారి అభిమానితో ఆయన ఎంతో ఆప్యాయంగా గడిపారు. చిన్నారిని ప్రేమగా పలకరించి ఆశీర్వదించిన మెగాస్టార్, జ్ఞాపకంగా ఓ చేతి గడియారాన్ని బహుమతిగా అందించి ఆనందపరిచారు. click here to read full story
A2 Milk నిజంగానే సాధారణ పాల కంటే మంచివేనా?
పాలు మానవ శరీరానికి సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. రోజూ గ్లాసు పాలు తాగితే మంచిదని చిన్నప్పటి నుంచి వింటునే ఉంటున్నాం. పాలలు శరీరానికి కాలిషియం, విటమిన్లు, మాంసకృతులు వంటి పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఏ2 పాలు అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏ2 పాలా.. అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ ఈ పాలు సాధారణ పాలతో పోలిస్తే.. జీర్ణం కావడం సులభమని, ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని ప్రచారం జరుగుతోంది. అసలు ఏ2 పాలు అంటే ఏమిటి? వాటి ప్రత్యేకత ఏమిటి? అని తెలుసుకుందామా.. click here to read full story
