NEWS@3:00 P.M | 12 జూలై 2026 ముఖ్యాంశాలు

S Janaki | క్యాంప్ కార్యాలయంలో ఎస్‌.జాన‌కి సేవలు స్మ‌ర‌ణ

S Janaki | ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ నేపథ్య గాయని, గాన కోకిల ఎస్. జానకి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. తన క్యాంప్ కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. click here to read full news

Archery | ఆర్చరీలో భారత మహిళలకు రజతం..

Archery | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మాడ్రిడ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ నాలుగో దశ పోటీల్లో మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ వెన్నం, పృథిక ప్రదీప్, చికిత్సా తానిపర్తి సభ్యులుగా ఉన్న భారత జట్టుకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. click here to read full news

Kishan Reddy | గోల్నాకలో కిషన్‌రెడ్డి పాదయాత్ర..

Kishan Reddy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గోల్నాక బస్తీ, కాలనీ ప్రాంతంలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికుల మధ్యకు వెళ్లిన కిషన్‌రెడ్డి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. click here to read full news

Oman Ship Attack | 10 మంది భారతీయులు సురక్షితం, ఒకరు గల్లంతు

Oman Ship Attack | ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : ఒమన్ తీరం సమీపంలోని హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ‘జీఎఫ్‌ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై జరిగిన దాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణాల రక్షణ కోసం నౌకను అత్యవసరంగా విడిచిపెట్టాల్సి వచ్చింది. click here to read full news

Police Officer | పోలీసు అధికారిపై ఆగ్రహం

Police Officer | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఓ పోలీసు అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆరేళ్ల మనవరాలిని కారు స్టీరింగ్ వద్ద కూర్చోబెట్టి వాహనం నడిపించిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కారణంగా కొంతసేపు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. click here to read full news

Private buses | భారీ అగ్నిప్రమాదం.. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధం

Private buses | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అక్కడ పార్కింగ్‌లో ఉన్న ప్రైవేట్ బస్సులకు వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం ఏడు ప్రైవేట్ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. click here to read full news

Lok-Adalat-Reunites-Couple : విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు Andhra {rabha :egal News

( పుత్తూరు చ ఆంధ్రప్రభ) Lok-Adalat-Reunites-Couple విడిపోవాలని కోర్టు మెట్లెక్కిన ఆ జంట… కలిసి జీవించాలని చేతులు కలిపి తిరిగి ఇంటిబాట పట్టింది. మనస్పర్థలతో దూరమైన రెండు మనసులను న్యాయస్థానం కౌన్సెలింగ్‌తో దగ్గర చేసింది. శనివారం పుత్తూరు కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ ఓ కుటుంబంలో మళ్లీ ఆనందాన్ని నింపింది. click here to read full news

youth-dies | తగువారిపల్లిలో కలకలం

youth-dies | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగువారిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన కూలీలు నివసిస్తున్న ప్రాంతంలో జరిగిన ఘటనలో ఓ యువకుడు కత్తిపోటుకు గురై మృతి చెందాడు. click here to read full news

july12th indrakeeladri| భక్తజన సందోహంతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి..

విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూలై 11, 2026 తేదీన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం భక్తుల నుంచి విశేష స్పందన కనిపించింది. click here to read full news