పలివెల చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా పూల వెంకటేశం

మునుగోడు, ఆంధ్రప్రభ : మండలంలోని పలివెల గ్రామం చేనేత సహకార సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గం శనివారం ఎన్నికల అధికారి జ్యోతి సమక్షంలో బాధ్యతలు చేపట్టింది. సంఘ అధ్యక్షుడిగా పూల వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పున్న రాజు,కార్యదర్శిగా చెరుకు నరేష్, కోశాధికారిగా బడుగు గోవర్ధన్,డైరెక్టర్లుగా కొలను రాధిక,చెరుకు జనార్ధన్, కోణం మురళి,మేకల వీరస్వామి,బడుగు హేమలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను సంఘ సభ్యులు అభినందించారు.చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం అధ్యక్షుడు పూల వెంకటేశం పేర్కొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.