చేనేత సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నిక

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ చేనేత సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికల్లో వంగరి రాములు ప్యానల్ ఘన విజయం సాధించింది. అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం (కొండా లక్ష్మణ్ బాపూజీ) అనుబంధంగా కొనసాగుతున్న మోత్కూర్ మండల, పట్టణ పద్మశాలి సంఘం మద్దతుతో ఈ ప్యానల్ పోటీ చేసింది.

ఎన్నికల్లో వంగరి రాములు ప్యానల్‌కు చెందిన తొమ్మిది మంది సభ్యులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి మహ్మద్ సుజాత్ అలీ ప్రకటించారు. డైరెక్టర్లుగా వంగరి రాములు, పెండెం రాజారాం, ఏలూరు మచ్చగిరి, పోచం కన్నయ్య, మహేశ్వరం మధుసూదన్, జోగు మచ్చేందర్, జల్ది రవీందర్, మంచే పద్మ, ఎలగందుల సుజాత ఎన్నికయ్యారు.