రేపు కడెం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఈ నెల 11వ తేదీ (రెండో శనివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కడెం ట్రాన్స్‌కో ఏఈ ఎం. రాంసింగ్ తెలిపారు. కడెం, లింగాపూర్, బెల్లాల్ 33 కేవీ సబ్‌స్టేషన్లలో నెలవారీ నిర్వహణ పనులు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సబ్‌స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించి శాఖకు సహకరించాలని కోరారు. అలాగే, మరమ్మతుల కారణంగా కోల్పోయిన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా (నాలుగు గంటలు)ను రైతులకు రాత్రి సమయంలో అందజేస్తామని ఏఈ ఎం. రాంసింగ్ తెలిపారు.
