గ్రామాభివృద్ధికి వార్డు సభ్యులు కీలకం : ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి

మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలోని గిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం చివరి రోజు శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి, సమర్థవంతమైన స్థానిక పాలనలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

పంచాయతీ రాజ్ చట్టాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానిక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి ఎంపీడీవో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిపురం సర్పంచ్ నీలా సైదులు, ట్రైనర్లు రామోజీ, ప్రణయ్, వెంకన్న, సుమన్, దేవయ్య, పంచాయతీ కార్యదర్శులు విజిత, రాజోద్దీన్, అశోక్, నేహా తరణం, సృజన, ఉమేష్, పావని, ఆపరేటర్లు ఉమా, ఉమేష్‌తో పాటు రాజా ,వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.