july10th indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

భక్తుల సౌకర్యమే లక్ష్యం.. ఇంద్రకీలాద్రిపై సజావుగా దర్శనాలు.
శుక్రవారం సాధారణంగా కొనసాగిన భక్తుల రద్దీ
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..
రద్ది ని పర్యవేక్షించిన ఏసీ కమిషనర్ రంగారావు
విఐపి ప్రోటోకాల్ దర్శనాలు రద్దు…
అందరికీ అమ్మవారి ముఖమండప దర్శనమే..
ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు

july10th indrakeeladri |ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సహాయ కమిషనర్ రంగారావు స్వయంగా క్యూలైన్ల నిర్వహణను పర్యవేక్షించి, దర్శన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. శుక్రవారం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో వీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసి సాధారణ భక్తులకు ప్రాధాన్యం కల్పించారు. దేవస్థానం అధికారులు చేపట్టిన సమర్థవంతమైన ఏర్పాట్లతో భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భద్రత, తాగునీరు తదితర సౌకర్యాలు సక్రమంగా అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలు సజావుగా కొనసాగాయని అధికారులు తెలిపారు.