పరకాల పట్టణంలో బందు విజయవంతం
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
పరకాల, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సందర్భంగా పరకాల పట్టణంలో బంధు విజయవంతం అయ్యింది. ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ బందుకు ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాల సైతం విద్యార్థులు బందుకు సహకరించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి నియమించాలని ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు రాలేదని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, ఇస్మాయిల్, పట్టణ కార్యదర్శి సాయి, తేజ, విక్కీ తదితరులు పాల్గొన్నారు.
