Tahsildar-Vro-Suspended : తాహసీల్దార్ వేటు Andhra Prabha Top News

Tahsildar-Vro-Suspended : తాహసీల్దార్ వేటు Andhra Prabha Top News

  • మూలపాడు వీఆర్వో సైతం సస్పెన్షన్​
  • తప్పుడు ఎఫ్ఎంసీ మంజూరు ఫలితం
  • అవినీతి ఆరోపణల నేపథ్యం
  • ఎన్డీఆర్​ జిల్లా కలెక్టర్​ తీవ్ర ఆగహం
  • తక్షణమే కఠిన చర్యలకు ఆదేశం
  • ఆంధ్రప్రభ ఎఫెక్ట్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ:

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మూలపాడు వీఆర్వో నరేంద్రలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అడ్డగోలు అవినీతిపై ఈ నెల 6వ తేదీన ‘అవినీతికి అడ్డా’ శీర్షికన ఆంధ్రప్రభలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందులో రూ.లక్షలు తీసుకుని ఎఫ్ఎంసీలు మంజూరు చేస్తున్నారని, కొటికలపూడిలో ఒకరికి తప్పుడు ఎఫ్ఎంసీ మంజూరు చేసినట్లు, ఇంకా మూలపాడు వీఆర్వో నరేంద్రతో కలిసి పలు అవినీతి ఆరోపణలపై కథనం వచ్చింది. తప్పుడు ఎఫ్ఎంసీపై కలెక్టర్ కు ఫిర్యాదు అందడంతో రద్దు చేసి తహసీల్దార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కథనంలో ప్రస్తావించడం జరిగింది.

దీనిపై విచారణ చేయించిన కలెక్టర్ లక్ష్మీశ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వీఆర్వో నరేంద్రపై అవినీతి ఆరోపణలు వాస్తవం అని తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.