డోంగ్లి మండలంలో రైతు భరోసా వేడుకలు

  • సీజన్ కు సంబంధించిన 9008 మంది రైతుల ఖాతాల్లో 11.21 కోట్లు జమ
  • డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి

డోంగ్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అహర్నిశలు కృషి చేస్తోందని డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, డోంగ్లి మండలంలో ఇప్పటివరకు 9,008 మంది రైతులకు వానాకాలం రైతు భరోసా కింద రూ.11 కోట్ల 21 లక్షల 59 వేల నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతు పక్షపాత ప్రభుత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతు భరోసా నిధులను సకాలంలో విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్, సర్పంచ్‌లు సంగ్రామ్ పటేల్, బస్వరాజ్ పటేల్, శ్రీధర్, శ్రీకాంత్, దత్తు నక్కేవార్, మాజీ ఎంపీటీసీ దిన్‌దయాల్, మార్కెట్ కమిటీ సభ్యుడు హన్మంత్ పాటిల్, నాయకులు చాంద్ పటేల్, ధనంజయ్ పాటిల్, రాజు పాటిల్, విలాస్ గైక్వాడ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.