తిమ్మాపూర్ బడి ఘటన విచారణ వాయిదా..

జన్నారం, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ బడిలో జరిగిన ఘటనపై ఈరోజు విచారణ జరగవలసి ఉండగా అనివార్య కారణాలవల్ల ఈనెల 15 కు వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఘటనపై ఈరోజు జరగవలసిన విచారణను ఈనెల 15 కు వాయిదా వేసినట్లు స్థానిక ఎంఈఓ బానావత్ రాజేందర్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.ఆ ఘటనపై విచారణ చేపట్టవలసిన డీఆర్డీఓ కిషన్ అనివార్య కారణాలవల్ల నిర్వహించలేదని ఆయన తెలిపారు.

గత పక్షం రోజులుగా ఆ ప్రభుత్వ బడిలో పరస్పరం ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తను విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రయ్యకు పంపానని ఆయన చెప్పారు. నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం రాజును, ఉపాధ్యాయుడు సురేందర్ ను ఇదే జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేశారన్నారు.దీంతో ఆ ఉపాధ్యాయులను బదిలీ చేసినప్పటికీ జిల్లా స్థాయి అధికారిచే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విచారణకు ఆదేశించారు.