janasena| పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
janasena| పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల నేతలు జనసేనలో చేరిక
హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత
తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జనసేన
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి మరో అడుగు పడింది. రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల నాయకులు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులు జనసేన సిద్ధాంతాలు, ప్రజాసేవకు పార్టీ కట్టుబాటు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన వేదికగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర బాధ్యుడు నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు, నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, మచ్చా సుధాకర్, గడల శ్రీనివాస్, మిరియాల రామకృష్ణ, ప్రజీత్ గౌడ్, తనీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజలకు చేరువై జనసేన సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నాయకులకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పార్టీని మరింత విస్తరించే దిశగా ఇటువంటి చేరికలు కొనసాగుతాయని నాయకులు పేర్కొన్నారు.
