ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం..

  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపుతున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.అధికారం అలంకారం కాదని,ప్రజాసేవే మా బాధ్యతని ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా స్వీకరించి, సంబంధిత శాఖలతో అనుసంధానం చేసి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయం పిఏ భార్గవ్, శివ,ఇంచార్జి ఘంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.