మంథని ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
మద్యం మత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు పలువురికి గాయాలు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా మంథని ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బొలెరో వాహనం నడుపుతున్న డ్రైవర్ అదుపు తప్పి ముందుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు పలువురికి గాయాలయ్యాయి.
సుల్తానాబాద్ నుంచి ఓడేడు వైపు వెళ్తున్న వాహనంలో ప్రయాణిస్తున్న ఓడేడుకు చెందిన రామగిరి వెంకటలక్ష్మి, మొండయ్య, రామకృష్ణలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కమాన్‌పూర్ 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా మంథని ఫ్లైఓవర్‌పై సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మద్యం మత్తులో వాహనం నడిపిన బొలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
