Bhimsa | బాల్కనీ నుంచి జారి చిన్నారి మృతి..
Bhimsa | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి బాల్కనీలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందపడటంతో మృతిచెందింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా జారిపడి కిందపడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకోగా, స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
