Karur | కరూర్ ఘటనలో రాజకీయ కుట్ర..
డీలిమిటేషన్‌కు వ్యతిరేకం..
Karur |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కరూర్‌లో నిర్వహించిన సభలో తమిళనాడు సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని పేర్కొంటూ, ఆ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.
కరూర్ పోలీసులు తమను ముందుగా అప్రమత్తం చేయలేదని, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని అప్పటి ప్రభుత్వానికి ముందే తెలిసి ఉండేదని ఆయన అన్నారు. అయినప్పటికీ తమను సభా ప్రాంగణానికి తీసుకెళ్లారని ఆరోపించారు.
ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న విజయ్, త్వరలో జన్మించే చిన్నారులకు బంగారు ఉంగరాలు అందజేసే కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. అలాగే త్వరలో టీవీకే (TVK) శక్తి ఏంటో ప్రజలకు చూపిస్తామని వ్యాఖ్యానించారు.
అవినీతికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించిన సీఎం విజయ్, అసెంబ్లీలో తమ పార్టీని చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ వ్యతిరేకమని కూడా స్పష్టం చేశారు.
