బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన బరుపతి పోషమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈవిషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన మాల కుటుంబ సభ్యులు, యువకులు మానవత్వాన్ని చాటుతూ స్వచ్ఛందంగా చందాలు సేకరించి రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన వారు, కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలవడం సమాజానికి ఆదర్శమని పలువురు పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు నిదర్శనమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన మాల కుటుంబ సభ్యులు, యువకుల సేవాభావాన్ని గ్రామ పెద్దలు, స్థానికులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.