Taj Mahal | తాజ్‌మహల్‌లో శివాలయం? వాస్తవాలపై చర్చ

Taj Mahal | తాజ్‌మహల్‌లో శివాలయం? వాస్తవాలపై చర్చ

  • తాజ్‌మహల్‌ వివాదం మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది?
  • కుట్ర సిద్ధాంతాలు, చరిత్ర పునర్‌లిఖనంపై వాదనలు
  • చరిత్ర పరిశోధనలో అనుత్తరిత ప్రశ్నలు
  • రాజకీయాలు, మతం, చరిత్ర మధ్య సంబంధం

Taj Mahal | తాజ్‌మహల్‌ ప్రదేశంలో పూర్వం శివాలయం ఉండేదన్న కుట్ర కథనాన్ని మోడీ ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ, అలహాబాద్‌ హైకోర్టు మాత్రం పురావస్తు పరిశోధనా సంస్థనూ, కేంద్ర ప్రభుత్వాన్నీ, ఈ అంశం గురించి సరైన రీతిలో ప్రతిస్పందించాల్సిందిగా ఆదేశించింది. దేశంలోని సుందరమైన ప్రదేశాల్లో తాజ్‌మహల్‌ ముఖ్యమైనది. జీవితంలో ఒక్కసారైనా అటువంటి అతిలోక సుందర మందిరాన్ని సందర్శించాలని ప్రతి ఒక్కరూ ఉవ్వీళ్లూరుతుంటారు. అటువంటి సుందరమైన భవనం గురించి గతంలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు మళ్లీ అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచ వారసత్వం పొందిన ప్రదేశం.

మొగలాయీ చక్రవర్తి అయిన షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ సమాధిపై నిర్మింపజేశాడన్న కథనాన్ని చరిత్ర పుస్తకాల్లో మనమంతా చదువుకున్నాం. తాజ్‌మహల్‌ని మొఘల్‌ భవన నిర్మాణ శాస్త్రానికి గొప్ప ప్రేరణగా గుర్తించబడింది. అయితే, తాజ్‌మహల్‌ గతంలో ఒక హిందూ కట్టడమనీ, షాజ్‌హాన్‌ దానిని కూలదోయించి ఈ సుందరభవనాన్ని కట్టించారని పిటిషనర్‌ కథనం.

మహాద్వారం వద్ద ఓ ఆత్మా నీవు ప్రశాంతంగా ఉన్నావు. దేవునివద్దకు వెళ్లి, ఆయనతో నీవు ప్రశాంతంగా ఉన్నావు అని తెలుపుతున్న అక్షరాలు కనిపిస్తాయి. పరిష్యన్‌ చిత్రకారుడు అబ్దుల్‌ హక్‌ చే ఇది సృష్టించబడింది. అయితే, పురావస్తు శాఖ ఈ థియరీని తోసిపుచ్చింది. హిందూ ద్వేషులు ఇలా రాయించారన్నది వారి అభిప్రాయం. మొగలాయీలకు అనర్హమైన ప్రతిష్టను ఆపాదించడం కోసం ఇలా సృష్టించారన్న కథనాలు వెలువడ్డాయి.

నేను ఒక పాఠశాల విద్యార్థిగా భారత దేశ చరిత్ర పునర్‌ రచన సంస్థ అధిపతి పిఎన్‌ఓక్‌ రాసిన పుస్తకాన్ని చదివాను. అప్పట్లో కుట్ర కథనాలు జనంలో ఒక విధమైన ఆకర్షణగా ఉండేవి. దేవతలు ఆకాశంలో నక్షత్రాలకు దూరంగా ఉంటారన్న కథనాలు వచ్చేవి. తాజ్‌ కథలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి, పిఎన్‌ ఓక్‌ రచనలు అప్పట్లో నేను చాలా చదివాను. ముస్లిం పాలకులు హిందూ దేవతల గురించి ఇలా రాయించారనిచెప్పుకునేవారు. ఫతేపూర్‌ సిక్రీ కూడా గతంలో హిందువులదేనని కథనం ప్రచారంలో ఉండేది. కష్టించి పని చేసిన హిందూ చరిత్రకారులు ఇలాంటి కథనాలను ప్రచారంలోకి తెచ్చారు.

అలాగే, నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో చనిపోలేదని నేను నమ్మేవాడిని. అలాగే, ఆంగ్ల కవి షేక్‌స్పియర్‌ హిందూ కవి అనే సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. మా సంస్కృత ఉపాధ్యాయుడు భారతీయులు పూర్వం విమానాన్ని కనిపెట్టారని చెప్పారు. అయితే, భారతీయ నాగరికత ప్రాభవాన్ని తోసిపుచ్చడానికి పాశ్చాత్యులు ఆ వాదాన్ని తోసిపుచ్చారు.

అలాగే, అపోలో-11 వ్యోమగామి బజ్‌ ఆల్డ్రిన్‌ ఇస్లాంలో చేరినట్టు విని చాలా ఆశ్చర్యపోయాను. ఆల్డ్రిన్‌ చంద్రునిపై కాలిడారు. అక్కడ అతనికి శబ్దం వినిపించింది. ఆతడు తిరిగి వచ్చిన తర్వాత ఆ శబ్దం ముస్లింల ప్రార్థనగా అనిపించిందట. దాంతో అతడు ఇస్లామిక్‌ ప్రచారకుడు అయ్యాడు. ఆ తర్వాత ఆల్డ్రిన్‌ని నేను స్వయంగా కలిసి ఆయన చంద్రయాన్‌ యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఆయన ఇస్లాంలోకి మతం మారలేదు. అది మాత్రం ఖాయం.

ఈ కథనాల్లో కొన్ని మతోన్మాదానికి సంబంధించినవై ఉంటాయి. ఆల్డ్రిన్‌ కూడా అలాంటివాడై ఉంటాడు. నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలిడిన సిద్ధాంతం కూడా కట్టుకథే అని అనేవారున్నారు.

కొన్ని ప్రశ్నలు సహేతుకమైనవే, ఈ మధ్య కొన్ని కుట్ర సిద్ధాంతాలు పెరుగుతున్నాయి. చరిత్ర పరిశోధన విషయంలో దానిని ఖండించేవారి కథనాలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి తోచినది వారు చెబుతూ ఉంటారు.

మురళీ మనోహర్‌ జోషి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరప్పన్‌ నాగరికత సింధులోయలో నిర్మించింది కాదనీ, సరస్వతి నదిపైనని చరిత్ర పరిశోధనలో తేలిందని చెప్పారు. హరప్పన్‌ సంస్కృతిపై ప్రశ్నలకు సమాధానం లేదు. వారి పూర్వీకులు ప్రస్తుత ద్రవిడియన్లు, వారికి మతం ఉండేదా? తమ భాష గురించిన మిస్టరీని వారు ఎందుకు పరిష్కరించలేకపోయారు.

ఈ మధ్య కుట్ర థియరీలకూ, చరిత్ర పునర్‌ లిఖిత థియరీలకూ మధ్య తేడా కనిపిస్తోంది. హరప్పన్‌ సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. చరిత్రను సీరియస్‌గా రాసిన వారి కథనాలను రాజకీయాలు కమ్మేస్తున్నాయి. హిందూయిజం భారత దేశంలోనిది కాదనీ, ఆ తర్వాత వచ్చిందనే వాదన ఉంది. క్రైస్తవం కేరళకు వచ్చిన తర్వాత చాలా రోజులకు యూరప్‌కి వచ్చిందనే వారున్నారు. రోమ్‌ క్రైస్తవ నగరం తర్వాత అయిందని అనేవారు ఉన్నారు.

హిందుత్వ మద్దతుదారులు ముస్లింలను బయటి వారని అంటూంటారు. హిందువులు ఎక్కడి నుంచో వచ్చారనీ, అనేవారు ఉన్నారు. ముస్లింలు భారత్‌పైకి దండెత్తి వచ్చారన్న థియరీ ఉంది. ముస్లిం దురాక్రమణదారుల వల్ల హిందుత్వవాదులు ఎన్ని బాధలు పడ్డారో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. భారత సంస్కృతికి ముస్లింలు చేసిందేమీ లేదని అంటారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజం అవుతుంది. రాజకీయవాదులు ప్రస్తుతం చేస్తున్నది అదే.

—-వీర్‌ సంఘ్వీ, జర్నలిస్టు