అత్యవసర వైద్యం కోసం రూ. 9 లక్షల 60 వేల ఎల్ ఓ సీ అందజేత.

భవానిపురం, ఆంధ్రప్రభ : ఎం ఎల్ ఏ సుజన చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన,ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, మరియు కూటమి నేతలతో కలిసి అందజేశారు. 37 వ డివిజన్, తార పేట కు చెందిన అహ్మద్ బాషా ఖాన్ (64) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతడికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 9 లక్షల 60 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎం ఎల్ ఏ సుజన చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.. కూటమి నేతలు పచ్చి పులుసు వెంకట శివప్రసాద్,రుద్రపాటి వెంకటేష్, దుర్బేసుల హుస్సేన్, పోలవరపు దుర్గారావు , షమీలా ఖాతూర్, గాయత్రి పాల్గొన్నారు…