movie teaser| మాస్ యాక్షన్‌లో రష్మిక..
movie teaser| మాస్ యాక్షన్‌లో రష్మిక..
జూలై 15న ‘మైసా’ టీజర్ విడుదల
గోండు గిరిజన యువతిగా పవర్‌ఫుల్ పాత్రలో రష్మిక మందన్న
బ్యాంకాక్‌లో ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ శిక్షణ..
అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టీజర్‌ను జూలై 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమాలో రష్మిక గోండు తెగకు చెందిన గిరిజన యువతిగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన గ్లామర్, కమర్షియల్ పాత్రలకు పూర్తి భిన్నంగా, అడవి నేపథ్యంలో అణగారిన ప్రజల కోసం పోరాడే ధైర్యవంతురాలి పాత్రలో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
యాక్షన్ సన్నివేశాలను మరింత సహజంగా తెరకెక్కించేందుకు రష్మిక బ్యాంకాక్‌లో రోజుకు సుమారు ఎనిమిది గంటల పాటు ప్రత్యేక మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా, అన్‌ఫార్ములా ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందిస్తున్నారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘మైసా’ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
