రూ.4 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

  • పనులు ప్రారంభించిన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. 11వ వార్డులోని శిల్పా వెంచర్‌లో రూ.1.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం 33వ వార్డులో రూ.1.60 కోట్లతో, 28వ వార్డులో రూ.1 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ జగ్గారెడ్డి సహకారంతో సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి సంగారెడ్డిలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రఘు రాథోడ్, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్, నాయకులు కూన సంతోష్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, మహేష్, రవి నాయక్, తులసిరామ్, దశరథ్ రెడ్డి, శైలేష్ రెడ్డి, శ్రీశైలం, సతీష్ రెడ్డి, నవాజ్, అశ్విన్, కో-ఆప్షన్ సభ్యులు బబ్బు తదితరులు పాల్గొన్నారు.