ఐఐటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్దే
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లాకు ఐఐటీని తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది.
అనంతరం ప్రభు గౌడ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలను అమలుచేసి రైతులను ఆదుకున్న రైతు నాయకుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు పార్వతి కృష్ణ యాదవ్, నాగరాణి, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి కే. సుధాకర్ గౌడ్, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, సలహాదారులు కరణ్‌జిత్ సింగ్, కార్యదర్శులు గౌలి ఈశ్వర్, శ్రీనివాస్, శ్రీశైలం, రవీందర్, మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు మానస, కార్యదర్శి కోటి వీరమణి, శృతి గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, తెలంగాణ ఉద్యమకారుల నాయకులు సుభాష్, కౌర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
