Pmgsy-4 : ఏ,కొండూరు హ్యాపీ Andhra Prabha Spl Story
Pmgsy-4 : ఏ,కొండూరు హ్యాపీ Andhra Prabha Spl Story
- రోడ్లన్నీ అనుసంధానం
- సీఎం సడక్ యోజన వరం
- రూ 1.815 కోట్ల నిధులు మంజూరు…
- 1.71 కి.మీ. రోడ్డుకు మోక్షం ..
- గ్రామీణ కనెక్టివిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్…
- నియోజకవర్గ అభివృద్ధికి మరో అడుగు..
- ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి
- కేంద్రం సానుకూల స్పందన
( తిరువూరు ఆంధ్రప్రభ)
తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలానికి మరో కీలక అభివృద్ధి ప్రాజెక్టు లభించింది. ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ, నిరంతర అనుసరణ ఫలితంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన–4 (2026–27, బ్యాచ్–1) కింద రూ.1.815 కోట్ల అంచనా వ్యయంతో 1.71 కిలోమీటర్ల అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఈ ప్రాజెక్టు ఏ.కొండూరు మండల అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
Pmgsy-4 : : కీలక రహదారికి మోక్షం…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలానికి కేంద్రం నుంచి మరో అభివృద్ధి వరం అందింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన–4లో భాగంగా రూ.1.815 కోట్లతో 1.71 కిలోమీటర్ల అనుసంధాన రహదారి నిర్మాణానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఎంపీ కేశినేని చిన్ని చేసిన ప్రత్యేక విజ్ఞప్తి, నిరంతర ప్రయత్నాల ఫలితంగా మంజూరైంది. గ్రామీణ రహదారులు కేవలం ప్రయాణ సౌలభ్యానికే పరిమితం కాకుండా ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల పురోగతికి బలమైన పునాదిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
Pmgsy-4 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపు…
ఏళ్లుగా సరైన అనుసంధాన రహదారుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏ.కొండూరు మండల ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడటంతో పాటు స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపు లభించనుంది. ఇప్పటికే మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొచ్చిన ఎంపీ చిన్ని, ఇప్పుడు రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి ఆమోదం సాధించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకొచ్చారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Pmgsy-4 : కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

తన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి వెంటనే ఆమోదం తెలిపిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలో మౌలిక వసతుల విస్తరణ, గ్రామీణ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కల్పనకు మరిన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తా.. దశాబ్దాలుగా రహదారి కోసం ఎదురుచూస్తున్న ఆ ప్రాంత ప్రజల కోరిక నెరవేరింది.
కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ ఎంపీ .
