ఊరపండుగ.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని వినతి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌లో నిర్వహించనున్న ఊరపండుగ సందర్భంగా సోమవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని సర్వసమాజ్ కమిటీ విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు బుధవారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) స్వామికి సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ మాట్లాడుతూ, ఊరపండుగలో విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్థానిక సంప్రదాయాలను వీక్షించే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటించాలని కోరారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.