ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

గండీడ్, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతిని గండీడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన నాయకులు వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత అని కొనియాడారు.

ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు నరసింహారావు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, కొటాల చిన్నయ్య, సర్పంచులు చెన్నారెడ్డి, కిష్టప్ప, రఘు, మాజీ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, లక్ష్మారెడ్డి, రాజు నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆశన్న, సుదర్శన్ రావు, బాలయ్య, ఆశిరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, మన్యపు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుముడాల చెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.