గ్రామీణులు హక్కులపై అవగాహన పెంచుకోవాలి..

  • చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవీందర్ నాయక్

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవీందర్ నాయక్ సూచించారు.

శనివారం మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో ప్రజలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు, వరకట్న నిషేధం, బాల కార్మికులు, ఫోక్సో చట్టం, భూవివాదాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఎమ్మార్వో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లేదా లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.

డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యోగేశ్వర్ రాజు యాదవ్ మాట్లాడుతూ వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం ఉత్తమమని సూచించారు.

ఈ కార్యక్రమంలో యోగేశ్వర్ రాజు యాదవ్, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాజ్, గ్రామ సర్పంచ్ మంగి ఆశ, ఉప సర్పంచ్ కృష్ణయ్య, ఆంజనేయులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వివిధ పార్టీల నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.