Hospital | నలుగురు శిశువులు మృతి..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో రజని సింగరామ్ అనే గర్భిణి ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో ఆటోలోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.

అయితే నెలలు నిండకముందే, ఏడో నెలలో ప్రసవం కావడంతో పాటు శిశువుల బరువు చాలా తక్కువగా ఉండటంతో పుట్టిన కొద్దిసేపటికే నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.
జిల్లా ముఖ్య వైద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు శిశువుల మొత్తం జనన బరువు కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉంది. తీవ్రమైన అపరిపక్వ స్థితిలో జన్మించడం, బరువు చాలా తక్కువగా ఉండటమే వారి మృతికి ప్రధాన కారణమని వివరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంబులెన్స్ సకాలంలో అందుబాటులోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదా అనే చర్చ కూడా సాగుతోంది.
