Pimpri-Chinchwad | శిథిలాల కింద 15 మంది
Pimpri-Chinchwad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పుణె సమీపంలోని పింప్రి-చించ్వాడ్లో మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
గత వారం రోజులుగా పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల ప్రభావంతో సుమారు 6 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడంతో పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
