రైతుల పాలిట ఆపద్బాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి

  • వైఎస్సార్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు
  • పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు

మక్తల్ , ఆంధ్రప్రభ: రైతుల పాలిట ఆపద్బాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం లో భాగంగా… రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, దీంతో వ్యవసాయం పండగలా మారిందని కాంగ్రెసు నాయకులు కొనియాడారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.బుధవారం మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను కొనియాడారు.

చిన్న వయసులోనే ఎమ్మెల్యే గా ఎంపికై, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా… ప్రజా జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడిగా వైఎస్సార్ ప్రజల మన్ననలను పొందారని కీర్తించారు. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర… చరిత్ర సృష్టించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం తో అనేక ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి దేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, నాయకులు బి .శంషొద్దీన్ ,కె. నాగిరెడ్డి ,నీలాగౌడ్, గోవర్ధన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.