Trump | ఇరాన్‌తో ఇక ఒప్పందం లేదు..

Trump | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నౌకలపై జరిగిన దాడులతో ఇరాన్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లేనని ఆయన ప్రకటించారు.

ఇరాన్‌తో ఇకపై ఎలాంటి ఒప్పందం లేదా చర్చలు అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోందని, భవిష్యత్తులో కూడా ఆ దేశంతో చర్చలు జరిపే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పశ్చిమాసియా మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుండగా, పలు గల్ఫ్ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.