చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

కుంటాల, (ఆంధ్రప్రభ): చెట్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఆరు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన గ్రామస్తులకు పండ్ల మొక్కలను పంపిణీ చేసి, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లు జీవనాధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్, పంచాయతీ కార్యదర్శి రాజాబాపు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.