టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం

తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతల స్వీకరణ
కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం.. వేదాశీర్వచనం

తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ: టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి కె. కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. కె. కన్నబాబుకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.