షాపింగ్‌కు వెళ్తూ ఘోర ప్రమాదం..

యువతి దుర్మరణం

విస్సన్నపేట, ఆంధ్రప్రభ : మండల పరిధి కొండ పర్వ గ్రామం నూజివీడు నుండి విస్సన్నపేట పోవు ప్రధాన రహదారి మెయిన్ రోడ్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న చల్లపల్లి శృతి (28) ఈ సందర్భంగా ఎస్ ఐ అర్జున్ రాజు మాట్లాడుతూ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామానికి చెందిన చల్లపల్లి నవీన్ భార్య శృతి ఆడపడుచు వివాహానికి సంబంధించి షాపింగ్ చేసేందుకు మంగళవారం శృతి సోదరుడు చరణ్ కలసి పల్సర్ ద్విచక్ర వాహనంపై చిత్తపూర్ గ్రామం నుండి విస్సన్నపేట వస్తుండగా కొండ పర్వ గ్రామం ప్రాంతంలో ఉన్న అవాంటెల్ కంపెనీ సమీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

టీఎస్ 0 8 యు ఎఫ్ 8667 12 చక్రాల లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే శృతి మృతి చెందగా ఆమెతో పాటు ప్రయాణిస్తున్న శృతి అత్త చల్లపల్లి సుజాత మెరుగైన వైద్యం కొరకు నూజివీడు ప్రభుత్వ వైద్యశాలలో తరలించగా శృతి సోదరుడు చరణ్ విస్సన్నపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని వారిద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నదని ఎస్ ఐ అర్జునరాజు తెలిపారు. మృతురాలు శృతిని పీఎం కొరకు విస్సన్నపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు.