ఇంటర్, 10వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభం
కేసముద్రం, ఆంధ్రప్రభ: 2026–27 విద్యా సంవత్సరానికి కేసముద్రం స్టేషన్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోఆర్డినేటర్ గంగుల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 29వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత పత్రాలను పాఠశాలలో సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అసిస్టెంట్ కోఆర్డినేటర్ అగుర్తి సురేష్‌ను 9291653497 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
