జూలై 14లోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించండి..

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల ఆర్డీఓ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి, కలర్ ఫోటోతో పాటు సంబంధిత బీఎల్ఓకు జూలై 14లోగా సమర్పించాలని కోరారు.

ప్రస్తుతం ఈ ప్రక్రియ జిల్లాలో 59 శాతం, బాపట్ల మున్సిపాలిటీలో 49 శాతం మాత్రమే పూర్తయిందని తెలిపారు. ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.