మహర్ కుల సంఘం సమస్యలు పరిష్కరిస్తాం..

  • ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మహర్ కుల సంఘం నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, మహర్ కులస్తుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంఘం నాయకులు అందజేసిన వినతిపత్రంలో గౌతమ బుద్ధుని జన్మదినమైన బుద్ధ పౌర్ణమిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని, వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, బౌద్ధ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.