ఉపాధ్యాయుడు నిలిగొండ సాయిలుకు కన్నీటి వీడ్కోలు

ఉపాధ్యాయుడు నిలిగొండ సాయిలుకు కన్నీటి వీడ్కోలు

మోత్కూర్, ఆంధ్రప్రభ:

మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని విశ్వభారతి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా, నిర్వాహకుడిగా సేవలందించిన నిలిగొండ సాయిలు (58) ఆదివారం ఉదయం కన్నుమూశారు.గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన సాయిలు మృతి పట్ల పాఠశాల పూర్వ విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాయిలు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు, పాఠశాల డ్రెస్ కోడ్‌కు ప్రతీకగా తెల్ల చొక్కా, కాషాయ రంగు ప్యాంటుతో కూడిన వస్త్రాన్ని కప్పి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శ కార్యక్రమంలో శాలివాహన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ విభాగ అధ్యక్షుడు మారుపాకల బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షుడు చేతరాశి అంజయ్య, బుజిలాపురం మాజీ సర్పంచ్ చేతరాశి వీరస్వామి, యూత్ విభాగ నాయకుడు మారుపాకల వెంకటేష్ పాల్గొన్నారు.

అలాగే పాఠశాల పూర్వ విద్యార్థి, గ్రంథాలయ చైర్మన్ కోమటి మచ్చగిరి, పూర్వ విద్యార్థులు అంబటి వెంకటేష్, చోళ్ళేటి సోమేశ్, పురుగుల శ్రీను, భైరబోయిన కార్తిక్, సైదులు, చోళ్ళేటి నరేష్, అనిల్‌తో పాటు ఉపాధ్యాయులు బయ్యని రాజు, సజ్జనం మనోహర్, బిట్ల ఆనంద్, పురుగుల రాములు, దేవినేని అరవింద్ రాయుడు, పుట్ట వేణు, పెండ్యాల రవిచందర్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు టి. మనోహరాచారి తదితరులు నివాళులర్పించారు.

సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియల్లో సాయిలు అభిమానులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు.

Leave a Reply