ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి

నర్సింహులపేట, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ ఆధ్వర్యంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. దేశ సమైక్యత,జాతీయ భావజాలం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు నెలకుర్తి సత్యనారాయణ రెడ్డి,మెరుగు యాకయ్య,శారదా రెడ్డి,బానోతు రమేష్,నన్నబోయిన ఉమేష్ తదితరులు ఉన్నారు.