NEWS@08:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు

కనకదుర్గమ్మకి కాసుల వర్షం..

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు కానుకల వర్షం కురిపించారు. జూన్ 20 నుంచి జూలై 6 వరకు 16 రోజుల హుండీ లెక్కింపులో మొత్తం రూ.3,39,53,599 ఆదాయం click here to read the full news


యాదాద్రి క్షేత్రంలో నాగ సాధువులు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని నాగ సాధువుల బృందం దర్శించుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు ఆలయ విశిష్టత, కృష్ణశిలా శిల్పకళను ప్రశంసించారు. వారి రాకతో యాదాద్రిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. click here to read the full news


అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్…

అయోధ్య రామమందిరం విరాళాల అక్రమాల కేసు నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా వైదొలగగా, కృష్ణమోహన్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. click here to read the full news


జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్ల మెరుపుదాడి..

మణిపూర్ ఉఖ్రుల్ జిల్లాలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, పలువురు గాయపడ్డారు. ఘటనను హోంమంత్రి గోవిందాస్ కొంతౌజం తీవ్రంగా ఖండించారు. click here to read the full news


డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు, నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకుంది. click here to read the full news

టీమిండియా సంచలన నిర్ణయం..

జింబాబ్వే టీ20 పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. తొలిసారి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఎంపిక కాగా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, రింకూ సింగ్, మయాంక్ యాదవ్ జట్టులోకి తిరిగివచ్చారు. click here to read the full news