Mumbai SpiderMan | ముంబైలో స్పైడర్‌మ్యాన్ హల్చల్‌

భివాండీలో మోకాళ్ల లోతు నీటిలో ట్రాఫిక్ నియంత్రిస్తూ.. వాహనాలను బయటకు తీస్తూ సేవలు
ప్రశంసలతో పాటు మున్సిపల్ వ్యవస్థ వైఫల్యంపై నెటిజన్ల ఆగ్రహం

Mumbai SpiderMan | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: భారీ వర్షాలతో అతలాకుతలమైన మహారాష్ట్రలోని భివాండీ పట్టణంలో ఓ యువకుడు నిజ జీవిత ‘స్పైడర్‌మ్యాన్’గా మారి ప్రజలకు అండగా నిలిచాడు. స్థానికుడు షాదాబ్ మొమిన్ మోకాళ్ల లోతు వరద నీటిలో గంటల తరబడి నిలబడి, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, పాదచారులకు సహాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భివాండీ రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. మురికి నీటిలో గుంతలు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అత్యవసర సిబ్బంది అక్కడ కనిపించకపోవడంతో షాదాబ్ స్వచ్ఛందంగా రంగంలోకి దిగాడు.

స్పైడర్‌మ్యాన్ దుస్తులు ధరించి వరద నీటిలో నిలబడి వాహనాలకు దారి చూపడం, నిలిచిపోయిన ద్విచక్ర వాహనాలు, కార్లను తోసి బయటకు తీసుకురావడం, ట్రాఫిక్‌ను నియంత్రించడం, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేలా సహాయం చేయడం వంటి సేవలను గంటల పాటు కొనసాగించాడు.

షాదాబ్ చేసిన సేవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య