90 Movies | రోడ్డు ప్రమాదంలో కన్నుమూత..
90 Movies | రోడ్డు ప్రమాదంలో కన్నుమూత..
90 Movies | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దక్షిణ భారత చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బీ.చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘నువ్వు వస్తావని’, ‘సంక్రాంతి’, ‘నవవసంతం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
పలు భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించిన ఆయన, సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. ఆయన మరణంతో సినీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
