ప్రజావాణిలో 24 అర్జీలు..
- త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆర్డిఓ ఆదేశాలు
పరకాల, ఆంధ్రప్రభ: పరకాల ఆర్డీఓ కార్యాలయం పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 24 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మొత్తం 24 అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కరించాలని ఆర్డీఓ వెంకన్న ఆదేశించారు.
