CV Anand | మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్
ప్రారంభించిన డీజీపీ సీవీ. ఆనంద్
ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రజలకు అంకితం
హాజరైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు
CV Anand |భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సి.వి. ఆనంద్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడంలో కీలకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం డీజీపీ పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడంలో పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, మణుగూరు సీఐ పాటి నాగబాబు, అశ్వాపురం సీఐ చిలివేరు ఎల్లయ్య, బయ్యారం సీఐ ఏర్పుల వెంకటేశ్వర్లు, వివిధ పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
