కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

చెన్నూరు, (ఆంధ్రప్రభ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆదివారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కేటీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లకుండా నాయకులను అడ్డుకుంటూ వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ముందస్తు అరెస్టులతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.