RTC Bus Accident | చివరగా ఒక్క ప్రయాణికుడే.. బస్సు బోల్తాతో కలకలం
RTC Bus Accident | చివరగా ఒక్క ప్రయాణికుడే.. బస్సు బోల్తాతో కలకలం
RTC Bus Accident | ప్రయాణికులంతా ముందే దిగిపోవడంతో తప్పిన భారీ ప్రమాదం..
డ్రైవర్ నిద్రమత్తే కారణమా?
RTC Bus Accident | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తాపడిన ఘటన కలకలం రేపింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఈ బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడం, అర్ధరాత్రి కావడంతో మార్గమధ్యంలోనే ప్రయాణికులంతా దిగిపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో చివరగా ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా కొద్దిసేపు ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.
