చౌటుప్పల్ బస్టాండ్‌కు ట్రినిటీ స్కూల్ మైక్ సెట్ విరాళం
చౌటుప్పల్, (ఆంధ్రప్రభ): చౌటుప్పల్ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం స్థానిక ట్రినిటీ స్కూల్ యాజమాన్యం మైక్ సెట్‌ను విరాళంగా అందజేసింది. బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్టీసీ కంట్రోలర్ ఆనందరావుకు మైక్ సెట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ మన్మథ కుమార్ మాట్లాడుతూ బస్సుల రాకపోకల సమయాలు, ఇతర ముఖ్యమైన ప్రకటనలను ప్రయాణికులకు సులభంగా చేరవేయడంలో ఈ మైక్ సెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక బాధ్యతతో స్పందించి బస్టాండ్‌కు మైక్ సెట్‌ను అందించిన ట్రినిటీ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ట్రినిటీ స్కూల్ డైరెక్టర్ కమ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జిని మంజుల, పాఠశాల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు, ఆర్టీసీ సిబ్బంది, పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
