భువనగిరికి చేరుకున్న కేటీఆర్‌కు ఘన స్వాగతం
యాదాద్రి, (ఆంధ్రప్రభ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కళ్లేపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆదివారం భువనగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు భువనగిరిలోని వివేరా వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం కేటీఆర్ వివేరాలో అల్పాహారం చేశారు.
ఆలేరులో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి తదితరులు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, వివేక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, తుంగ బాలు, అమరేందర్, కిరణ్, జక్క రాఘవేందర్‌రెడ్డి, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
