France-Beat-Paraguay : ఫెనాల్జీ ఛాన్స్​ తో .Andhra Prabha Sports Story

France-Beat-Paraguay : ఫెనాల్జీ ఛాన్స్​ తో .Andhra Prabha Sports Story

  • కెప్టెన్​ ఎంబాప్పే మ్యాజిక్​
  • 1-0 తేడాతో ఫ్రాన్స్​ విజయం​
  • ఫలించని పరాగ్వే కష్టం
  • జూలై 9న మొరాకోతో ఫైట్​

( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి)

ఫిఫా ప్రపంచ కప్ 2026 హాట్​ ఫేవరేట్​ టీమ్​… ఫ్రాన్స్ కు పరాగ్వే జట్టు​ చుక్కలు చూపించింది. అమెరికాలో తాజా హీట్​ వేవ్​ కి ఫోటీగా.. ఫ్రాన్స్​ జట్టుకు పరాగ్వే చెమటలు పట్టించింది. నువ్వా నేనా అనే రీతిలో సాగుతున్న ఈ భీకర పోరులో తమకు లభించిన ఫెనాల్టీ చాన్స్​తో… ఫ్రాన్స్​ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే చాకచ్క్యంతో.. 1-0 గోల్​ తేడాతో ప్రాన్స్​ గట్టెక్కింది. క్వార్టర్​ ఫైనల్స్​ కు చేరింది. ఇక మొరాకోతో తలపడుతుంది.

ఈ మ్యాచ్​ లో పరాగ్వేపై విజయం ఫ్రాన్స్​ కు కష్టసాధ్యమైంది, అమెరికాలోని ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ, శారీరక ఘర్షణలు విపరీత వేడి వాతావరణంలో సాగింది. మ్యాచ్ ఫలితం & స్కోరర్ఫలితం: ఫ్రాన్స్ 32వ రౌండ్‌లో జర్మనీని ఓడించి సంచలనం సృష్టించిన పరాగ్వే జట్టు, ఈ మ్యాచ్‌లోనూ ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్ల కు కళ్లెం వేసింది. ఐదుగురు డిపెండర్లతో ఢఙఫెన్స్​ వ్యూహం రచించింది. తొలి అర్ధభాగంలో ఫ్రాన్స్ పూర్తిగా బంతిని ఆధీనంలో (76% పొసెషన్) ఉంచుకున్నప్పటికీ గోల్ చేయటానికి పరాగ్వే అవకాశం ఇవ్వలేదు.

France-Beat-Paraguay : టర్నింగ్ పాయింట్

మ్యాచ్ 69వ నిమిషంలో ఫ్రాన్స్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ‘డెసిరే డౌ’ ని పరాగ్వే డిఫెండర్ డియెగో గోమెజ్ డి బాక్స్‌లో కింద పడేసాడు. మొదట రెఫరీ దీనిని ఫౌల్‌గా ప్రకటించనప్పటికీ, వీడియో అసిస్టెంట్ రెఫరీ సమీక్ష తర్వాత ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ చాన్స్​ లభించింది.ఈ పెనాల్టీని ఫ్రాన్స్​ కెప్టెన్​ ఎంబాప్పే చాలా కూల్‌గా గోల్ కీపర్‌ను పక్కకు డైవ్ చేయిస్తూ నెట్‌లోకి పంపాడు. ఈ టోర్నమెంట్‌లో ఇది అతనికి 7వ గోల్ కాగా, దీనితో గోల్డెన్ బూట్ రేసులో లియోనెల్ మెస్సితో సమానంగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో ఇది అతనికి 19వ గోల్ గా రికార్డు నమోదైంది.

France-Beat-Paraguay : ఫలించని పరాగ్వే కీపర్ కష్టం..

పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లో (90+6వ నిమిషంలో) ఎంబాప్పే కొట్టిన రెండు బ్యాక్-టు-బ్యాక్ షాట్లను అద్భుత డబుల్-సేవ్‌తో అడ్డుకుని ఫ్రాన్స్ స్కోరును 1 గోల్‌కే పరిమితం చేశాడు. ఈ మ్యాచ్ చాలా రఫ్‌గా సాగింది. పరాగ్వే ఆటగాళ్లు ఫ్రెంచ్ స్టార్ ఆటగాళ్లపై కఠినమైన టాక్లింగ్స్ చేయడంతో మైదానంలో ఇరు జట్ల మధ్య పలుమార్లు వాగ్వాదాలు జరిగాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగాయి. ఈ విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రాబోయే గురువారం (జూలై 9, 2026) బోస్టన్ వేదికగా జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకో తొ తలపడుతుంది.