10:00 A.M. | 4 జూలై 2026 ముఖ్యాంశాలు
10:00 A.M. | 4 జూలై 2026 ముఖ్యాంశాలు
- గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్లతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్లాంట్ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ ప్రణాళికలను పరిశీలించారు.
- రాజమహేంద్రవరం గోదావరి బో స్ట్రింగ్ ఆర్చ్ రైల్వే వంతెన పునరుద్ధరణలో 672 హ్యాంగర్ కేబుళ్లలో 500 కేబుళ్ల మార్పిడి, 28 స్పాన్లలో 20 స్పాన్ల పనులు పూర్తయ్యాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా పనులు కొనసాగడం విశేషం.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫర్టిలిటీ సేవలను విస్తరించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ప్రత్యేక ఫర్టిలిటీ ఓపీ క్లినిక్స్ ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులను నియమించాలని సూచించారు.
- సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో ప్రముఖ ఈ-కామర్స్ ఇన్‌స్టంట్ డెలివరీ సంస్థ ఇన్‌స్టామార్ట్ కేంద్రంలో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడ్డాయి.
- ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ మరియానా బెర్నాల్ డోపింగ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెపై మూడేళ్ల నిషేధం విధించింది.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుంచి ఆరు రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అధికారిక పర్యటన చేపట్టి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
- ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మెటాకు నోటీసులు జారీ చేసి వివరణ కోరేందుకు కేంద్ర ఐటీ శాఖ సిద్ధమైంది.
- నిర్మల్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి ఆలయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటే తదితర నేతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వినియోగదారులకు ఇంధన ధరల తగ్గింపు ఇప్పట్లో లభించే అవకాశాలు కనిపించడం లేదు.
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
